ఫోన్ ట్యాపింగ్ దోషులు చిక్కుతారా ?

     ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు రోజుకో ములుపు తిరుగుతోంది. దీంతో నెక్ట్స్‌ ఏం జరుగుతోంది..? ఏ నిజాలు బయటపడతాయన్న ఉత్కంఠ నెలకొంది. అయితే,.. ఇప్పటి వరకు పోలీస్‌ అధికారుల చుట్టూ నడిచిన ట్యాపింగ్‌ వ్యవహారం.. ఇప్పుడు సర్వర్ల చుట్టూ తిరుగబోతోంది. మరి సర్వర్ల ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు వెలుగు చూడనున్నాయి..? అప్పుడైనా అసలు సూత్రధారులు బయటపడతారా..?

   ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రోజుకో ట్విస్ట్‌ వెలుగు చూస్తోంది. నిందితుల నుంచి కీలక విషయాలను కక్కిస్తున్న దర్యాప్తు బృందం.. ఇప్పుడు సర్వర్లపై ఫోకస్‌ పెట్టింది. ట్యాపింగ్‌కు సంబంధించిన సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో పడింది. SIB కార్యాలయంలో లాగర్‌ రూమ్స్‌ నుంచి స్పెషల్ ఆపరేషన్‌ టార్గెట్‌ చేస్తున్నారు. SIB పేరిట ఎవరె వరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం నోటీసులు అందజేశారు. ఓ ప్రముఖ టెలీకమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందిన ఉద్యోగి సహకారంతోనే ప్రణీత్ రావు సర్వర్లని అమర్చిన్నట్లు గుర్తించారు అధికారులు. ఇందుకు సంబంధించిన సమాచారం కోసం రాధాకిషన్‌రావు నుంచి కూపీ లాగుతున్నారు.

       ప్రధానంగా SIB ఆపరేషన్‌పై ఫోకస్‌ పెట్టారు అధికారులు. SIBలో రెండు లాగర్‌ రూమ్స్ నుంచి ప్రణీత్‌ రావు 17 కంప్యూట ర్లను ఆపరేట్‌ చేసేవాడని గుర్తించారు. ఇందుకోసం అనధికారికంగా ఇంటర్‌ నెట్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి సంబంధించిన సాఫ్ట్‌వేర్లు ప్రైవేట్‌ వ్యక్తులతో ఇన్‌స్టాల్‌ చేయిం చాడు. మరో వైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసం కావడంతో సాంకేతిక ఆధారాల సేకరణ లో దర్యాప్తునకు ఇబ్బందిగా మారింది. దీంతో నిందితుల వాంగ్మూలాల ఆధారంగానే పోలీసులు ముందు కెళ్తున్నారు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ కోసం బేగంపేటలోని SIBకి అనుసంధా నమైన ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు కంపెనీలకు చెందిన సర్వీస్ ప్రొవై డర్లకు నోటీసులు ఇవ్వనునున్నారు అధికారులు. మరోపక్క సాఫ్ట్‌వేర్‌ కొనుగోలుకు ఓ ఎమ్మెల్సీ కోట్ల రూపాయలు సమకూర్చారని ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు.. ఆ అతడికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

    ట్యాపింగ్‌ కేసులో సరైన ఆధారాలు లభించకపోతే.. ఈ దర్యాప్తు SIB లాగర్ రూమ్ ధ్వంసంతోనే ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌పై ఆధారపడుతోంది దర్యాప్తు బృందం. ఇందుకుగాను నిందితులతోపాటు SIBలో విధులు నిర్వహించిన సిబ్బంది,.. ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసుల నుంచి కూపీ లాగి అసలు సూత్రధారులెవరో రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి గత కొన్నా ళ్లుగా నిందితుల నుంచి నిజాలు కక్కిస్తున్న అధికారులకు అసలు దోషులు చిక్కుతారా..? హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసంకావడంతో మరేదైనా టెక్నాలజీతో అసలు విషయాన్ని రాబడుతారా..? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్