నేడు అనంతపురం జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా రాప్తాడు, బుక్కరాయసముద్రంలో బహి రంగ సభల్లో పాల్గొం టారు. పార్టీ శ్రేణులు, ప్రజల్లో చైతన్యం నింపుతూ ముందుకు కదులుతున్నారు చంద్రబాబు. కూటమి విజయమే లక్ష్యంగా చంద్రబాబు ప్రచార శంఖారావం పూరించారు. బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా ప్రత్యేక చొరవ చూపుతున్నారు పార్టీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు.

రాప్తాడులో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు ధర్మవరం నియోజకవర్గం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్. శింగనమల లో నిర్వహించే బహిరంగ ఏర్పాట్లను ఆ నియోజకవర్గ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నారసన్నాయుడు పరిశీలిం చారు. చంద్రాబు మదనపల్లి నుంచి హెలిక్యాప్టర్‌లో ఉదయం 9.55 గంటలకు బయలుదేరి,10.40 గంటలకు అనంతపురం శివారులోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్‌కు చేరుకుంటారు. రాప్తాడు బస్టాండ్‌ సర్కిల్‌కు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 12.30 గంటల వరకూ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

రాప్తాడు బస్టాండు దగ్గర నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి, ఒంటి గంటకు అనంత పురం నగర శివారులోని ఆర్డీటీ స్టేడియానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల వరకూ భోజన విరామం తీసుకుంటారు. ఆర్డీటీ స్టేడియం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి.. బుక్కరా యసముద్రం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభ వద్దకు చేరు కుంటారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ప్రజాగళం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు బుక్కరాయసముద్రం నుంచి బయలుదేరి 4.30 గంటలకు నగర శివారు లోని అయ్యప్పస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కదిరి నియోజకవర్గ పర్యటనకు బయలుదేరుతారు.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్