ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం జోరందుకుంటోంది. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రచారాన్ని ప్రారంభించారు. మొదటి రోజు ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఉదయం స్థానికులతో చర్చలు, సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారు. నిన్న రాత్రి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బస చేసిన జగన్.. ఇవాళ రెండో రోజు అక్కడి నుంచే బస్సు యాత్ర ప్రారం భించనున్నారు. ఉదయం పది గంటలకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఆళ్లగడ్డ నుండి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామస్థులతో ముఖముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనం తరం గోవిందపల్లి మీదగా చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురం మీదుగా పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. తిరిగి రేపు అక్కడి నుంచే మూడో రోజు బస్సు యాత్ర ప్రారంభిస్తారు సీఎం జగన్.
నేడు నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటన
0
238
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


