‘లవ్ మాక్‌టైల్-2’ నుంచి ‘ఎవరితో పయనం’ పాట విడుదల

కన్నడ బ్లాక్ బస్టర్ నిర్మాత రచయిత దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ నటించిన ‘లవ్ మాక్‌టైల్-2’ మూవీ నుంచి ఎవరితో పయనం సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. ఎవరితో పయనం అంటూ సాగే ఈ పాటకి గురు చరణ్ లిరిక్స్ అందించగా యోగి సురేష్ అద్భుతంగా పాడారు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ లవ్ మాక్‌టైల్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అదేవిధంగా తను నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ హీరోగా నటించిన లవ్ మాక్‌టైల్, ‘లవ్ మాక్‌టైల్-2’ చిత్రాలతో కన్నడ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకం పై ఎం వి ఆర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.ఆర్ కృష్ణ గారు మాట్లాడుతూ ‘‘కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని వేసవి సెలవుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. డార్లింగ్ కృష్ణ కన్నడలో బ్లాక్ బస్టర్ హీరోగా మంచి సినిమాల్లో నటించాడు. అతను దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కి సంబంధించిన పాటను నేడు విడుదల చేసాం. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ ప్రమోషన్ ఆక్టివిటీస్ తో గ్రాండ్ గా మీ ముందుకు వస్తాం. మంచి సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమా కూడా అలాగే కంటెంట్ ఉన్న ఒక మంచి సినిమా. కథలో శివరాజ్ కుమార్ గారి వేద సినిమాకి తెలుగు ప్రేక్షకులు హిట్ చేసి చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ‘లవ్ మాక్‌టైల్-2’ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

నటీనటులు :
డార్లింగ్ కృష్ణ, మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్

టెక్నికల్ టీం :
నిర్మాణం : కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్
నిర్మాత : ఎం వి ఆర్ కృష్ణ
మ్యూజిక్ : నకుల్ అభయాన్కర్
డిఓపి మరియు ఎడిటర్ : శ్రీ క్రేజీ మైండ్స్
కథ మరియు దర్శకత్వం : డార్లింగ్ కృష్ణ
పి ఆర్ ఓ : మధు VR

Latest Articles

తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ

ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్