ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన బ్లడ్ షుగర్ స్థాయి 46కు పడిపోయిందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం వ్యాధిగ్రస్తుడైన కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ స్థాయి తరచు హెచ్చుతగ్గులు చూపిస్తోంది. బ్లడ్ షుగర్ స్థాయి ఇంతతక్కువకు పడిపోవడం ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. కేజ్రీవాల్ మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన బ్లడ్ షుగర్ తరచు హెచ్చుతూ, తగ్గు తుండడం ఆందోళన కల్గిస్తోందని ఆయనను కలిసిన కేజ్రీవాల్ భార్య సునీత అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కేజ్రీవాల్ ను మార్చి 21న అరెస్ట్ చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆరు రోజుల ఈడీ కస్టడి విధిం చింది. అంటే మార్చి 28 వరకూ ఆయన కస్టడీలోనే ఉండాలి.
ఈడీ కస్టడీలో దిగజారుతున్న కేజ్రీవాల్ ఆరోగ్యం
0
243
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


