మాజీ మంత్రి, కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరారు. బెంగళూరులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, సీనియర్ నేత యడియూరప్ప సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి అరుణ లక్ష్మీ కూడా బీజేపీ గూటికి చేరారు. తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు.
బీజేపీలో చేరికతో సొంత గూటికి వచ్చినట్టుందని గాలి జనార్ధన్ రెడ్డి అన్నారు. ప్రధాని మూడోసారి అధికారంలో నిలబెట్టేందుకు బీజేపీ కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. తనకు ఎలాంటి పదవులు వద్దని అన్నారు. మరోవైపు గాలి జనార్ధన్ రెడ్డి చేరికను యడియూరప్ప స్వాగతించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కర్ణాటకలోని 28 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా..లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన తన స్నేహితుడు శ్రీరాములుకు మద్దతుగా గాలి జనార్ధన్ రెడ్డి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.


