Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

తిరుపతి జిల్లా చంద్రగిరిలో ప్రేమోన్మాది ఘాతుకం

       తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తన ప్రేమను అంగీకరిం చకపోవడంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అర్ధరాత్రి సమయంలో యువతి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దాడికి పాల్పడి ఆమెను తీవ్రంగా గాయపరిచిన ఘటన చంద్రగిరిలో జరిగింది. కొన్నాళ్లు గా యువతిని వేధిస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నారు.

    చంద్రగిరి ఆర్‌ఎఫ్‌ రోడ్డుకు చెందిన యువతి చిన్నతనంలోనే తల్లిందండ్రులను కోల్పోయింది. ఆమె అమ్మమ్మ మంగమ్మ చిన్నప్పటి నుంచి ఆ యువతిని పెంచి పోషించింది. నర్సింగ్‌ పూర్తిచేసుకున్న యువతి ఏడాది క్రితం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సింగ్‌ శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో తన పక్కింట్లో అద్దెకుంటున్న కృష్ణయ్య కుమారుడు పిడతల మహేష్‌ యువతికి పరిచయమయ్యాడు. కొన్నాళ్లు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. తర్వాత మహేష్‌ చెడువ్యసనాలు తెలుసుకున్న యువతి అతని నుంచి దూరమైంది. అప్పటి నుంచి మహేష్‌ యువతి పై కక్ష పెంచుకున్నాడు. తరచూ వేధింపు లకు పాల్పడేవాడు. అయితే వారికి మగదిక్కు లేకపోవడంతో ఏంచేసినా ఏం అనలేకపోయేవారు.

      నెలన్నర క్రితం యువతి ఇంట్లోకి అక్రమంగా చొరబడిన ప్రేమోన్మాది మహేష్‌, యువతితోపాటు ఆమె అమ్మమ్మపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. స్థానికులు యువకుడిని అడ్డుకున్నారు. ఆపై యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రక్షణ లేకపోవడంతో పది రోజుల క్రితం యువతి పెద్దమ్మ వచ్చి ఆమెను చైన్నెకి తీసుకెళ్లింది. ఆ యువతి చంద్రగిరి ఆర్‌ఎఫ్‌ రోడ్డులో ఉంటున్న అద్దె ఇల్లును ఖాళీ చేసేందుకు గురువారం రాత్రి తన పెద్దమ్మతో కలిసి చెన్నె నుంచి చంద్రగిరికి చేరుకుంది. విషయం తెలుసుకున్న మహేష్‌ అర్ధరాత్రి సమయంలో కత్తి తీసుకుని యువతి ఇంట్లోకి ప్రవేశించాడు. తర్వాత యువతిపై కత్తితో దాడిచేశాడు. ఆమె ఛాతి, ఎడమ చేతిపై దాడి చేయడంతో తీవ్ర రక్తగాయాల య్యాయి. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో కత్తిని అక్కడ పడేసి ప్రేమోన్మాది మహేష్‌ పారిపో యాడు. అనంతరం స్థానికులు అక్కడకు చేరుకు ని, యువతిని 108 వాహనంలో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రుయా ఆస్పత్రికి చేరుకుని దాడికి గల కారణాలపై ఆరా తీశారు. నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు బాధితు రాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్