డ్రగ్స్‌ కేసులో హైకోర్టును ఆశ్రయించిన డైరెక్టర్‌ క్రిష్‌

        డ్రగ్స్‌ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్‌ క్రిష్‌ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశా రు. అలాగే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్‌ అట్లూరి, సందీప్‌లు కూడా హైకోర్టులో బెయిల్‌ కోసం పిటి షన్‌ దాఖలు చేశారు. మిగిలిన అనుమానితులు కూడా ముందస్తు బెయిల్‌ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలు స్తోంది. కొకైన్‌ తీసుకున్నారన్న కేసులో మంజీరా గ్రూపు డైరెక్టర్‌ వివేకానందతో పాటు నిర్భర్, కేదార్, డ్రగ్‌ పెడ్లర్‌ అబ్బాస్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానితులుగా ఉన్న డైరెక్టర్‌ క్రిష్‌తో పాటు చరణ్, సందీప్, లిషీ, శ్వేత, నీల్‌ ఇళ్లకు 160 CRPC నోటీసులు అంటించారు. మరో వైపు ఇవాళ విచారణకు క్రిష్‌ హాజరుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

బెంగళూరులో ఉన్న రఘు చరణ్‌ అట్లూరి గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హజరయ్యారు. ఆయనను వైద్య పరీక్షలకు తరలించారు. కాగా, లిషీ సోదరి నటి కుషిత గచ్చిబౌలి స్టేషన్‌కు వచ్చి తన సోదరి లిషీ ఇంటికి రావడం లేదని పోలీసులకు తెలిపింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాలని, దీనిపై లిషీకి సమాచారం ఇవ్వాలని పోలీసులు కుషితకు చెప్పినట్టు సమాచారం. సందీప్, శ్వేతల ఫోన్లు స్విచ్చాఫ్‌ ఉన్నాయని, ఇప్పటి వరకు వారు అందుబాటులోకి రాలేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సైంధవ్ సినిమా నిర్మాత వెంకట్‌ బోయినపల్లి కుమారుడు నీల్‌ విదేశా లకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

    అమెరికా పౌరసత్వం ఉన్న ఆయనను కొకైన్‌ తీసుకున్నట్లు అనుమానితుల జాబితాలో చేర్చడంతో దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు చెపుతున్నారు. రాడిసన్‌ బ్లూ హోటల్‌ డ్రగ్‌ పార్టీ కేసులో మరో పెడ్లర్, పాతబస్తీకి చెందిన మీర్జా వాహెద్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొదట డ్రగ్‌ పెడ్లర్‌ అబ్బాస్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆ తరువాత వివేకానంద డ్రైవర్‌ గద్దల ప్రవీణ్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. దీంతో డ్రగ్‌ పార్టీ కేసులో అరెస్ట్‌ అయిన వారి సంఖ్య ఆరుకు చేరింది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్