తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం

     తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీ యం వేడెక్కింది. ఒకరు చలో మేడిగడ్డ అని పిలుపునిస్తే.. మరొకరు చలో పాల మూరు, రంగారెడ్డి అని పిలుపునిచ్చారు. ఇవాళ మేడిగడ్డ సందర్శనకు గులాబీ దళం రెడీ అయ్యింది. కాసేపట్లో తెలంగాణ భవన్‌ నుంచి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్‌ వెళ్లబోతున్నారు. ప్రభుత్వం కాళేశ్వరం అంశంలో ఒక్క అంశా న్ని ప్రామాణికంగా తీసుకొని ప్రాజె క్టునే ఫెయిల్యూర్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాదంటూ బీఆర్ఎస్‌ నేతలు మండి పడతున్నారు. అధికార పార్టీ ఆరోపణలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజక్టు ప్రాధాన్యతను వివరించాలని బీఆర్ఎస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది.

      బ్యారేజిలో కుంగిపోయిన పిల్లర్లకు మరమ్మతులు చేయించి వచ్చే యాసంగికి రైతులకు నీరు అందించాలని బీఆర్ఎస్‌ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాజీ మంత్రులు కడియం, హరీశ్‌ రావు అన్నారంలో పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీని ద్వారా నీటి విని యోగంపై ఉన్న అవకాశాలను వివరించబోతున్నారు. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడులు ఏ స్థాయిలో పెరిగాయన్న దానిపై వివరాలు వెల్లడించ బోతున్నారు.

Latest Articles

భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 4,300 రూపాయలు తగ్గి 1,48,860 రూపాయలకు దిగజారింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 3,950 రూపాయలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్