విలువైన ఆస్తుల జాబితా ఇవ్వండి- సీఎం రేవంత్ రెడ్డి

      గ్రేటర్‌ హైద‌రాబాద్‌లో ప్రభుత్వ ఆస్తుల జాబితాను స‌మ‌ర్పించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. HMDA కార్యాలయంలో నాలుగు గంటలకు పైగా జరిగిన సమీక్షలో వాట‌ర్ వ‌ర్క్స్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, జీ హెచ్ఎంసీ పనుల ప్రగతిపై రేవంత్‌ సమీక్షించారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమీక్షలో సీఎం రేవంత్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో కొత్త మార్గాల‌కు త్వరలో శంకుస్థాప‌న చేయనున్నట్లు పేర్కొన్నారు. GHMC, HMDA ప‌రిధిలో బిల్డింగ్ ప‌ర్మిష‌న్స్ ఫైల్స్ క్లియర్‌గా ఉండా లన్నారు. బిల్డింగ్స్ అనుమ‌తుల‌కు సంబంధించి చాలా ఫైల్స్ క‌నిపించ‌కపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇష్టా నుసారంగా అనుమతులు మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. రోజుల వ్యవధిలో హెచ్ంఎండీఏ, జీహె చ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జ‌రుగుతాయని స్పష్టం చేసిన ఆయన.. అనుమతుల మంజూరులో అత్యుత్సాహం చూపిన అధికారులు ఇంటికి వెళ్క హెచ్చరించారు.

       ఆన్‌లైన్‌లో లేకుండా ఇచ్చిన అనుమ‌తుల జాబితా త‌యారు కావాలన్నారు సీఎం. HMDA వెబ్‌సైట్ నుంచి చెరువుల ఆన్‌లైన్ డేటా ఎందుకు మాయం అవుతోందని ప్రశ్నించారు. 3,500 చెరువుల డేటా ఆన్‌లైన్‌లో ఉండాల్సిందే అన్న ఆయన చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలిచ్చారుకొత్తగా ఏర్పడిన 85 మున్సిపాల్టిల్లో క‌మిష‌న‌ర్లు లేక‌పోవ‌డంపై సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేసారు. గ్రూప్‌ వన్‌ అధికారులు కమీషనర్లుగా ఉండేలా ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలిచ్చారు. జోన‌ల్ క‌మిష‌న‌ర్‌లు కుర్చీలు వదిలి కాలనీల బాట పట్టాలని సూచించారు. నగరంలో తాగునీటి కొరత లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.

Latest Articles

పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు

తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందేనని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్