టీవీ ఛానెల్ యాంకర్‌ కిడ్నాప్ …. నగరంలో కలకలం

        సినిమా కథను మించిన క్రైమ్‌ కథను హైదరాబాద్‌ పోలీసులు చేధించారు. నచ్చినవాడిని దక్కించుకోవడానికి ఎంతకైనా తెగించేందుకు సిద్ధమైంది ఓ యువతి. ఏకంగా యువకుడిని కిడ్నాప్‌ చేసి… తన వాడిని చేసుకోవా లను కుంది. యువతి చెర నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు ఆ యువకుడు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్‌ చూసి ఓ యువకుడిని చూసి ఇష్టపడిన అమ్మాయి.. తనను పెళ్లి చేసుకోవాలని వెంటపడింది. అతను నిరాకరించడంతో రౌడీలకు సుఫారీ ఇచ్చి మరీ కిడ్నాప్‌ చేయించింది. పది రోజులుగా తన రూమ్‌లోనే బంధించింది. చివరకు యువతి చెర నుంచి తప్పించుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

     ప్రణవ్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూనే.. ఓ టీవీ ఛానల్‌లో యాంకర్‌గా పార్ట్‌ టైమ్‌జాబ్‌ చేస్తున్నాడు. రెండేండ్ల క్రితం ప్రణవ్‌ ఫొటోను మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో చూసిన త్రిష అనే యువతి అతన్ని ఇష్టపడింది. తనను పెళ్లి చేసుకోవాలనుకుని అతడిని సంప్రదించింది. దీంతో తన పేరుతో ఫేక్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశారని తెలుసుకున్న ప్రణవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. ప్రణవ్‌ ఫోటో చూసి మనసుపడ్డ యువతి అతనితో పరిచయం పెంచుకుంది. అదే పరిచ యంతో తనను పెండ్లి చేసుకోవాలని త్రిష ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. పెళ్లికి ప్రణవ్‌ నిరాకరించడంతో త్రిష అతనిపై నిఘా పెట్టింది. అతని కారులో లొకేషన్‌ ట్రాకర్‌ అమర్చింది. ప్రణవ్‌ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో గమనిస్తూ ఉంది. ఈ నెల 11న రౌడీలకు సుఫారీ ఇచ్చి మరీ కిడ్నాప్‌ చేయించింది. అప్పట్నుంచి తన రూమ్‌లోనే బంధించింది. ఈ క్రమంలో త్రిష చెర నుంచి తప్పిం చుకున్న యాంకర్‌ ప్రణవ్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, త్రిష హైటెక్‌ సిటీలో డిజిటల్‌ మార్కెటింగ్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్