సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన …అభివృద్ధి పనులకు శంకుస్థాపన

   సీఎం రేవంత్​ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్​రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఇవాల పర్యటించనున్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకు స్థాపన చేయనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్​ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం కొడంగల్​ – నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. రూ.2,945 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
        కొండగల్‌లో సుమారు రూ.3,961 కోట్లకు పైగా పనులకు సీఎం రేవంత్​ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొనను న్నారు. తొలిసారిగా సీఎం రేవంత్​ కొడంగల్​ రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సైతం బహిరంగ సభకు వేలాదిగా హాజరుకానున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 31 వేల 849 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి పట్నం నరేందర్​రెడ్డిపై రేవంత్​ రెడ్డి గెలిచారు. అనంతరం రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇప్పుడు అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తుండడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్య టించాల్సి ఉన్నా, కొన్ని అత్యవసర కారణాలతో రెండుసార్లు పర్యటనను వాయిదా వేస్తూ వచ్చారు. రాష్ట్రా నికి నిధులు, లోక్​సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖరారు వంటి విషయాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్​ పర్యటన ముగిసింది. ఈ రోజు సొంత నియోజవకర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Latest Articles

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం – ముగ్గురి దుర్మరణం

కర్ణాటకలో జరిగిన  హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెరువులో బురదలోకి దూసుకెళ్లిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్