మార్చి 28న పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సినిమా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. మార్చి 28న “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

“ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ‘కాన్సెప్ట్ అనుకుని 16 ఏళ్లవుతోంది, స్క్రిప్ట్ రాసి 10 ఏళ్లవుతోంది. షూటింగ్ స్టార్ట్ అయి 6 ఏళ్లవుతోంది. ఈ వెయిటింగ్ ముగింపునకు వచ్చింది. మార్చి 28న “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) మీ ముందుకు వస్తోంది..’ అంటూ మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్, రన్వీర్ సింగ్ రిలీజ్ చేసిన సెకండ్ పోస్టర్, దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసిన ది బిగినింగ్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు. ఇది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందిన తొలి భారతీయ సినిమా కావడం విశేషం.

నటీనటులు – పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు

ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ – సునీల్ కేఎస్
సౌండ్ డిజైన్ – రసూల్ పూకుట్టి
మ్యూజిక్ – ఏఆర్ రెహమాన్
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
నిర్మాణం – విజువల్ రొమాన్స్
దర్శకత్వం – బ్లెస్సీ

Latest Articles

దర్శకుడు భారతీరాజా ఇకలేరు

ప్రముఖ దర్శకుడు భారతీరాజా(84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1941 జులై 17న భారతీరాజా జన్మించారు. 1977లో డైరెక్టర్‌గా 16 వయత్తినిలే తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్