21.2 C
Hyderabad
Friday, February 20, 2026
spot_img

జనసేనకు జై కొట్టిన ఎంపీ వల్లభనేని బాలశౌరి

        వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. నేడు జనసేన పార్టీలో చేరనున్నారు. మంగళ గిరి లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేశారు. బాలశౌరితోపాటు కృష్ణా జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. గుంటూరు, కృష్ణా రెండు జిల్లాల నుంచి భారీ ప్రదర్శనతో బాలశౌరి, ఆయన అనుచరులు మంగళగిరికి రానున్నారు. గత రెండు మూడు రోజులుగా విజయవాడ, గుంటూరుల్లోని ఎంపీ బాలశౌరి కార్యాలయానికి పెద్దఎత్తున ఆయన అభిమానులు, మద్దతుదారులు చేరుకుని సంఘీభావం తెలుపుతున్నారు.

      గుంటూరులోని ఎంపీ ఇంటి నుంచి మధ్యాహ్నం 3గంటలకు ర్యాలీగా బయలుదేరి కాజా టోల్‌గేట్‌ వరకూ చేరు కుంటారు. మరోవైపు కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో జనసైనికులు, బాలశౌరి మద్దతుదారులు కలిసి ప్రదర్శనగా బయలుదేరి చల్లపల్లి, మచిలీపట్నం, విజయవాడ మీదు గా కాజా వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి అంతా కలిసి జనసేన కార్యాలయానికి వెళ్లేలా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు. 2004 వైఎస్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చానని.. గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా బందర్ నుండి పోటీ చేసి గెలిచానని బాలశౌరి చెప్పారు. బందర్ పోర్టు నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. పోలవర తో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదేళ్లలో అనుకున్నంతగా పనులు జరగలేదని.. పోలవరం, స్టీల్ ప్లాంట్ అంశాలపై పవన్ కల్యాణ్ తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నానని బాలశౌరి తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్