అలహాబాద్ హైకోర్టులో ముస్లిం కక్షిదారులకు చుక్కెదురైంది. జ్ఞాన్ వాపి మసీదులోని సెల్లార్ లో పూజలు చేసుకు నేందుకు అనుమతి నిస్తూ వారణాశి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. జ్ఞాన్ వాపిలోని సెల్లార్ లో పూజలు కొనసాగించేందుకు అనుమతిచ్చింది. మసీదు ప్రాంగణంలోని సెల్లార్ లో పూజలు జరగ కుండా స్టే ఇవ్వాలని ముస్లిం మత సంస్థలు అలహాబాద్ హైకోర్టులో అపీలు చేశాయి. ఆ అపీలునే కోర్టు తోసిపుచ్చింది. ముస్లిం పక్షం తన అభ్యర్థనను సవరించాలని కోరింది. జ్ఞాన్ వాపి మసీద్ జిల్లా కోర్టు ఆదేశాన్ని చాలెంజ్ చేసిన అంజు మాన్ ఇంతిజామియా మస్జిద్ కమిటీ తన అభ్యర్థన సవరించుకునేందుకు, ఫిబ్రవరి 6 వరకు అలహాబాద్ హైకోర్టు గడువు ఇచ్చింది. వారణాశి జిల్లా కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మస్జిత్ కమిటీ చేసిన అపీలును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించి.. హైకోర్టును ఆశ్రయించవలసిందిగా కోరింది. జ్ఞాన్ వాపి మసీదు సెల్లార్ లోని విగ్రహాలకు ఓ పూజారి పూజలు చేసేందుకు వారణాశికోర్టు బుుధవారం ఆదేశాలు జారీ చేసింది.
అలహాబాద్ హైకోర్టులో ముస్లిం గ్రూప్ కు చుక్కెదురు
0
581
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


