25.3 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

‘అధర్వ’ నుంచి KCPD సాంగ్ రిలీజ్

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లు ఎప్పుడూ ప్రేక్షకులను కట్టిపడేస్తూనే ఉంటాయి. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్‌లను క్లూస్ టీం కోణంలోంచి చూపించేందుకు ‘అథర్వ’ అనే చిత్రం రాబోతోంది. అన్ని రకాల ఎమోషన్స్‌ కలిపి తీసిన ఈ చిత్రం నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందింది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు.

ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో మంచి బీట్ ఉన్న వీడియో పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. కేసీపీడీ అంటూ సాగే ఈ పాట అదిరిపోయింది. ఈ వీడియో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఊరి వాతావరణంలో ఎంతో సహజంగా ఈ పాటను తెరకెక్కించారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ, శ్రీ చరణ్ పాకాల బాణీ, గాత్రం ఈ పాటను వినసొంపుగా, చూడముచ్చటగా మార్చేశాయి. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం ఎంతో క్యాచీగా ఉంది.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీని తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్లోని క్లూస్, ఫోరెన్సిక్ విభాగం వారు వీక్షించారు. వారంతా కూడా సినిమాను ఆకాశానికెత్తేశారు. క్లూస్ టీంను ఇంత బాగా ఇదివరకు ఎవ్వరూ చూపించలేదని కొనియాడారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్