అప్పుడు మీ సంస్కారం ఎక్కడికి పోయింది- కేటీఆర్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: పీసీసీ రేవంత్‌రెడ్డికి జానారెడ్డి సంస్కారం నేర్పాలని.. కేసీఆర్‌కు పిండం పెట్టాలనుప్పుడు ఆయన సంస్కారం ఎక్కడికి పోయిందంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌ జల విహార్‌లో బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిలు, వార్‌రూమ్‌ సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ కాంగ్రెస్‌ తీరుపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నేaతల వద్ద సంస్కారం నేర్చుకోవాలని ఖర్మ లేదని, రూ.50 కోట్లకు పీసీసీ పదవి అమ్ముకున్న దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ అంటూ విమర్శించారు. అంతకుముందు రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి. కేటీఆర్‌కు సంస్కారం లేదని.. రాహుల్ గాంధీపై సంస్కారం లేకుండా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్లు ఏ పదవి లేకుండా స్వాతంత్య్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్ కాదా అని జానారెడ్డి ప్రశ్నించారు. ఉపాధి హామీ, ఆహార భద్రత, అటవీ హక్కులు, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కదా అని ఆయన నిలదీశారు. కరెంట్ ఉత్పత్తికి కృషి చేసింది తామేనని.. వాటిని మీరు కొనసాగిస్తున్నారని జానారెడ్డి దుయ్యబట్టారు. బీఆర్ఎస్‌ని సహించే పరిస్ధితిలో జనం లేరని.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ. 5.50 లక్షల కోట్లు అప్పు చేశారని జానారెడ్డి ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా వుందని.. 2004లోనే కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.

Latest Articles

అల్జీరియాపై హ్యాట్రిక్‌.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ

ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ అర్జెంటీనా దిగ్గజం లియోనల్‌ మెస్సీ( Lionel Messi) బుధవారం అల్జీరియాపై తన తొలి ఫిఫా వరల్డ్ కప్ హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. కాన్సాస్ సిటీలోని యార్రో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్