ఎమ్మెల్యే టికెట్ల కోసం.. దేవుడి మెట్ల వ‌ద్ద బిచ్చ‌గాళ్లు కూర్చున్నట్టే- సీఎం కేసీఆర్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: తూంకుంట‌లోని క‌న్వెన్ష‌న్ హాల్‌లో గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గ ముఖ్య నాయ‌కుల‌తో కేసీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నేను మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆ రోజున్న ముఖ్య‌మంత్రి కేబినెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుతారు అంటే.. ఇక తెలంగాణ‌కు పెట్ట‌బ‌డులు రావు అని అన్న‌డు. అట్లెట్ల స‌ర్.. నాక‌ర్థం కాదు అని ప్ర‌శ్నించాను.. త‌ల్లే ద‌య్యం అయినాక పిల్ల ఎట్ల బ‌తుకుత‌ది అని ప్ర‌శ్నించాను. నాడు ఎన్నిక‌లు రాగానే.. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌కు టికెట్లు ముందు ఇచ్చేవార‌ని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ద‌గ్గ‌ర ఉంట‌దనే నెపంతో లాస్ట్‌కు ఇచ్చేవారు. ఓ ఎల‌క్ష‌న్ల మా నాన్న చ‌నిపోతే నేను టికెట్ కోసం పోలేదు. అప్పుడు ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు. మీ టికెట్ ఫైన‌ల్ అయిందంట‌.. వచ్చి ఫారాలు తీసుకొని వెళ్ల‌మ‌ని ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని డీఎస్పీ వ‌చ్చి నాకు చెప్పిండు. తెల్లార‌గానే హైద‌రాబాద్ వ‌చ్చాను.. నాచారం స్టూడియోలో ఫారాలు ఇస్తున్నారంటే అక్క‌డికి వెళ్లాను. అక్క‌డ అంద‌రు తెలంగాణ వారే ఉన్నారు. రాష్ట్ర స్థాయి నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. దేవుడి మెట్ల వ‌ద్ద బిచ్చ‌గాళ్లు కూర్చున్న‌ట్టు కూర్చున్న‌రు. చాలా బాధ క‌లిగింది. ఇది ఏం ప‌ద్ధ‌తి అని.. టెంటు వేసి నాలుగు కుర్చీలు వ‌స్తే.. స‌రిపోయేది క‌దా అని అనుకున్నాను. సేం బిచ్చ‌గాళ్ల సీనే క‌నిపింద‌ని కేసీఆర్ తెలిపారు.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్