టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడి ఆరోగ్యం విషమం

మరో కొద్దిరోజుల్లో ఆ ఇంటిలో పెళ్లి… ఆ రెండు కుటుంబాలు ఎంతో సంతోషంగా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాయి. ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇంతలో సడన్ గా పెళ్లి కొడుక్కి హార్ట్ అటాక్ వచ్చిందనే విషయం తెలిసి ఒక్కసారి అందరి ఆనందం ఆవిరైపోయింది. అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి…  వివరాల్లోకి వెళితే…

టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంటిలోనే పెళ్లి. ప్రస్తుతం అతని కుమారుడు శివ ఆరోగ్యం విషమంగా ఉంది. ఉన్నట్టుండి సడన్ గా హార్ట్ అటాక్ రావడంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. పరిస్థితి విషమించడంతో ఎక్మో యంత్రంతో వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.

విషయం తెలిసిన వెంటనే ధర్మారెడ్డి హుటాహుటిన చెన్నై వెళ్లారు. అక్కడ కుమారుడి పరిస్థితి చూసి స్ప్రహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనకు తక్షణం వైద్యసేవలు అందించడంతో తేరుకున్నారు. విషయం తెలిసిన వెంటనే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కరుణాకర రెడ్డి తదితరులు కావేరీ ఆసుపత్రికి చేరుకున్నారు.

డిసెంబరు 26న ప్రముఖ పారిశ్రామిక వేత్త శేఖర్ రెడ్డి కుమార్తెతో శివకు వివాహం జరగనుంది. ఇటీవల వివాహ కార్యక్రమం కోసం ముంబై నుంచి శివ చెన్నై చేరుకున్నారు.

వివాహ అహ్వాన పత్రికలు పంచే క్రమంలో శివకు హార్ట్ అటాక్ రావడంతో స్నేహితులు వెంటనే కావేరీ ఆసుపత్రికి తరలించారు. ధర్మారెడ్డితో పాటు శేఖరరెడ్డి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

Latest Articles

రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు

హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్