సీఎం కేసీఆర్ ఎవరికి భయపడే వ్యక్తి కాదు- మంత్రి మల్లారెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్: మా మ్యానిఫెస్టో అద్భుతంగా ఉంటుందని వెల్లడించారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. మీడియాతో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. కాంగ్రెస్ నేతలకు ఫెస్ వ్యాల్యూ లేదని.. సీఎం కేసీఆర్ ఎవరికి భయపడే వ్యక్తి కాదు. కేసీఆర్ పులంటూ వెల్లడించారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. వచ్చే ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. ఇది ఇలా ఉండగా, ఇప్పటికే 115 మంది అభ్యర్థులని బీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. మల్కాజిగిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేసిన సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్కాజిగిరితో పాటు గతంలో ప్రకటించని జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వనున్నారు.మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌లో సునీత లక్ష్మారెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఐతే గతంలో ప్రకటించిన 114 మంది అభ్యర్థుల్లో ఇద్దరు, ముగ్గురిని మార్చవచ్చునని ప్రచారం సాగుతోంది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్