స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీలో కుల గణన చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 15 తర్వాత రాష్ట్రమంతటా కులాల వారీగా అధికారిక సర్వే ప్రారంభించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొని ఇంటింటా వివరాలు సేకరిస్తారు. ఇందుకోసం యాప్ రూపొందిస్తున్నారు. పారదర్శకత కోసం మొత్తం మూడు స్థాయిల్లో షాంపిళ్లను పునః పరిశీలన చేస్తారు. కాగా, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కుల గణన ప్రారంభమైంది. ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమైన వైసీపీ షెడ్యూల్ ఖరారు చేసింది. తొలి విడత యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈనెల 26న ప్రారంభించేందుకు సిద్ధమైంది. నవంబర్ 9 వరకు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. పార్టీలోని ఆయా వర్గాల సీనియర్ నేతలు ఈ యాత్రలో పాల్గొని సభల్లో ప్రసంగించనున్నారు.