స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ వలన రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ను ప్రభుత్వం అమలులోకి తీసుకురావడం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికల కోడ్ ఉండడం మూలంగా షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2 మరియు 3 వ తేదీలలో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. ఈ వార్త విన్న అభ్యర్థులు అంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఈ పరీక్షలను ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జరిపించాలంటే సిబ్బందిని కేటాయించడం కష్టంగా ఉంటుందన్న సమస్యను కలెక్టర్లు TSPSC దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయం గురించి బాగా ఆలోచించిన TSPSC కలెక్టర్ల తో ఏకీభవించి పరీక్షలను నిర్వహించడం కుదరదు అంటూ అధికారికంగా ప్రకటించింది. ఇక తదుపరి ఈ పరీక్షలను జనవరి 6 మరియు 7వ తేదీలలో నిర్వహించడానికి ప్రస్తుతం నిర్ణయం తీసుకుంది, ముందు ముందు ఈ నిర్ణయం మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
గ్రూప్ 2 పరీక్షలు వాయిదా..!
0
698
Previous article
Latest Articles
కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?
తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్‌కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -
- Advertisement -


