మోదీ కేబినెట్ సంచలన నిర్ణయం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం

స్వతంత్ర వెబ్ డెస్క్: దాదాపు రెండున్నర దశాబ్ధాలకు పైగా డిమాండ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు నరేంద్రమోడీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సోమవారం సాయంత్రం భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన గంటన్నరకు పైగా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును మంగళవారం ఉదయం ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

కాగా, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని మూడు దశాబ్ధాల క్రితం నుంచే ఉద్యమం నడుస్తోంది. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో అప్పటి హెచ్‌డీ దేవెగౌడ సారధ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం.. ఆ తర్వాత వచ్చిన వాజ్ పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టినా ఆమోదముద్ర పడలేదు. రాజ్యసభలో 2010లో ఆమోదం పొందినా.. 2014లో లోక్ సభ రద్దు కావడంతో ఆ బిల్లు మురిగిపోయింది. తాజాగా నరేంద్రమోడీ నేతృత్వంలో కేబినెట్ ఆమోదం తెలపడంతో దేశ వ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్