‘కోటబొమ్మాలి పీఎస్’ నుంచి శ్రీకాకుళం ఫోక్ సాంగ్ రాబోతోంది!

GA2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు నిర్మించగా కొన్ని ఇతర భాషలు సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు. తాజాగా మలయాళ సూపర్ హిట్ నాయాట్టుకి రీమేక్‌గా కోట బొమ్మాళి పిఎస్ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు కోట బొమ్మాళి PS మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. మాస్సీ శ్రీకాకుళం ఫోక్లోర్ ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ 11న విడుదలవుతుందని ఈరోజు ప్రకటించారు. ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో ఈ అప్డేట్ అందించారు. పూర్తిస్థాయి ఫోక్ సాంగ్‌తో రానున్న ఈ పాట ప్రేక్షకుల్ని అలరిస్తుందని అన్నారు దర్శకర్మాతలు. జోహార్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

తారాగణం: శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మరియు అనేక ఇతర ప్రముఖ నటీనటులు

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: తేజ మార్ని
ప్రొడక్షన్: GA2 పిక్చర్స్
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
సహ నిర్మాతలు: భాను ప్రతాప, రియాజ్ చౌదరి
డోప్: జగదీష్ చీకాటి
డైలాగ్స్: నాగేంద్ర కాశి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సంగీత దర్శకుడు: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అజయ్ గద్దె
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
కో-డైరెక్టర్: రామ్ నరేష్

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్