26.2 C
Hyderabad
Monday, September 29, 2025
spot_img

Erracheera: భయపెడుతున్న ‘ఎర్రచీర’ మోషన్ పోస్టర్

పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా బేబీ డమరి సమర్పణలో నిర్మించిన హర్రర్, యాక్షన్, థ్రిల్లర్, మదర్ సెంటిమెంట్ సౌత్ ఇండియా చిత్రం ‘ఎర్రచీర’. నవంబర్ 9న అందరినీ భయపెట్టే ఎర్రచీర సినిమా విడుదల కానుంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ రాఖీ పండుగ సందర్భంగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్‌ను గమనిస్తే సినిమాలో భారీ తారాగణంతో సమానంగా ఎర్రచీర ఎలాంటి ముఖ్యపాత్ర పోషించిందో ప్రేక్షకులకు తెలియచేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బేబీ సాయి తేజస్విని నటన సరికొత్తగా ఉంటుందని ఈ చిత్రం చూస్తున్నంతసేపు హర్రర్ సీన్స్‌తో థ్రిల్లింగ్‌గా ఉంటుందని, మదర్ సెంటిమెంట్ హార్ట్ టచింగ్‌గా ఉంటుందని దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ ఎర్ర చీర వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోవాలంటే నవంబర్ 9న సినిమాని థియేటర్స్‌లో చూడాల్సిందే అని ఆయన అన్నారు. ఈ సినిమా Eight Layers వారి VFX తో కళ్లుచెదిరే 36 నిమిషాల గ్రాఫిక్స్‌తో, మంచి నిర్మాణ విలువలతో నిర్మించామని నిర్మాతలు NVV సుబ్బారెడ్డి, సుమన్ బాబు తెలిపారు.

ఎర్ర చీర సినిమాలో ప్రధాన పాత్రలో శ్రీరామ్, kgf ఫేమ్ అయ్యప్ప పీ శర్మ, సీనియర్ నటులు DR. రాజేంద్ర ప్రసాద్ గారి ముద్దుల మనవరాలు అయిన మహానటి ఫేమ్ సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, కమల్ కామరాజు, సుమన్ బాబు, అజయ్, అలీ, రఘుబాబు, గీతాసింగ్, జీవ, భద్రం, సురేష్ కొండేటి, అన్నపూర్ణమ్మ, సత్య కృష్ణ తదితరులు నటించారు.

సాంకేతిక నిపుణులు:
VFX – విక్రాంత్ & భరత్
రీ రికార్డింగ్- చిన్న
సంగీతం – ప్రమోద్ పులిగిల్ల
సౌండ్ ఎఫెక్ట్స్ – ప్రదీప్
DOP – చందు
ఎడిటర్- వెంకట ప్రభు
ఆర్ట్- సుభాష్, నాని
స్టంట్స్ – నందు
లైన్ ప్రొడ్యూసర్స్ – అబ్దుల్ రెహమాన్, కరణ్
చీఫ్ కో డైరెక్టర్స్- నవీన్, రాజమోహన్
నిర్మాతలు- NVV. సుబ్బారెడ్డి, సుమన్ బాబు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :- సుమన్ బాబు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్