స్కూల్లో బ్రేక్ ఫాస్ట్.. మన దేశంలోనే తొలిసారిగా ఎక్కడో తెలుసా..?

స్వతంత్ర వెబ్ డెస్క్: దేశంలో తొలిసారిగా స్కూళ్లో  విద్యార్థులకు ఉదయాన్నే అల్పాహారం అందించే పథకాన్ని తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ 2023 ఆగస్టు 25 శుక్రవారం రోజున ప్రారంభించారు. నాగపట్నం జిల్లాలో సిఎం అల్పాహార పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి సీఎం అల్పాహారాన్ని తిన్నారు. 1,545 ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 5 తరగతుల్లో 1,14,095 మంది విద్యార్థులకు పోషకాహార అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విద్యార్థులు ఆకలితో అలమటించకుండా పాఠశాలలకు వచ్చేలా చూడడం, పిల్లలు పోషకాహార లోపంతో బాధపడకుండా చూడటం, పిల్లలకు పోషకాహారం అందే పరిస్థితిని మెరుగుపరచడం, రక్త హీనత వంటి సమస్యలను విద్యార్దులు అధిగమించడం  ఈ పథకం లక్ష్యమని వెల్లడించారు. ఈ ఫథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 404 కోట్లను ఖర్చు చేస్తోంది.  ప్రతిష్టాత్మకమైన పథకాన్ని తమ నియోజకవర్గాల్లో పార్టీలకతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రారంభించాలని స్టాలిన్ కోరారు.

Latest Articles

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు- చంద్రబాబు

చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వాతావరణ సమతుల్యం దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్