మంత్రి వర్గ విస్తరణ.. కేబినెట్‌లోకి పట్నం మహేందర్‌రెడ్డి..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయింపులో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి(Patnam Mahender Reddy), ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి( Pilot Rohit Reddy) కేసీఆర్‌ సయోధ్య కుదిర్చారు. తాండూరు టికెట్‌పై రాజీఫార్ములాలో భాగంగా శాసనమండలి సభ్యుడిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ఈ నెల 23న బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో పట్నం రాష్ట్ర మంత్రివర్గంలో చేరతారు.

2023లో తాండూరు అసెంబ్లీ టికెట్‌ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్న నేపథ్యంలో కేటీఆర్‌(KTR) మధ్యవర్తిత్వం వహించారు. రోహిత్‌ రెడ్డికి టికెట్‌ ఇస్తే సహకరించాలని మహేందర్‌రెడ్డిని కోరడంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న బెర్త్‌లో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు.

2021 మే నెలలో ఈటలను మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేసిన నాటి నుంచి కేబినెట్‌ బెర్త్‌ ఖాళీగా ఉంది. ప్రస్తుతం కుదిరిన రాజీ ఫార్ములామేర  కేబినెట్‌లో ఖాళీగాఉన్న బెర్త్‌లో పట్నం మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. మహేందర్‌రెడ్డి సుమారు 3 నెలలపాటు మంత్రిగా అధికారిక హోదాలో పనిచేస్తారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్