స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను(Pawan Kalyan) మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా(Rk Roja) అన్నారు. రుషికొండ వద్ద పవన్ కల్యాణ్ ఊగుడు చూస్తుంటే ఆయనను మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాల్సిన సమయం ఆసన్నమైందని అర్థమవుతుంది అని చెప్పుకొచ్చారు. రుషికొండపై నిర్మాణాలు కోర్టు అనుమతులుతో చట్టబద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని వివరణ ఇచ్చారు.
రుషికొండ(Rushikonda) మీద ఉండేది టూరిజం(Turism) స్థలం అని దాంట్లోనే నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. నిర్మాణాలను అడ్డుకునేందుకు టీడీపీ(TDP), జనసేన(Jansena), ఎంపీ రఘురామ కృష్ణంరాజులు కోర్టులను ఆశ్రయించారని కోర్టులు కూడా అనుమతి ఇచ్చాయని రోజా వివరించారు. అంతేకాదు ఎన్జీటీకి వెళ్లి నిర్మాణాలను అడ్డుకోవాలని చూశారని కానీ అక్కడ కూడా వీరందరికీ చుక్కెదురు అయ్యిందని రోజా చెప్పుకొచ్చారు. రుషికొండపై ప్రభుత్వం నిర్మిస్తున్న నిర్మాణాలపై పవన్ కల్యాణ్ విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు.
రుషికొండకు ఎదురుగా బాలకృష్ణ అల్లుడు, నారా లోకేశ్ తోడల్లుడు భరత్ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే పవన్ కల్యాణ్ ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. అప్పుడు పవన్ కల్యాణ్ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని మంత్రి ఆర్ కే రోజా మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. పవన్ కల్యాణ్ ఓ ఎంపీకాదు, ఎమ్మెల్యే కాదు కనీసం వార్డు మెంబర్ కూడా కాదని అన్నారు. ఏ అర్మత లేని పవన్ కల్యాణ్ పిచ్చి కూతలు కూస్తున్నారని మంత్రి ఆర్ కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.