TSPSC: గ్రూప్- 2 పరీక్ష రీ-షెడ్యూల్ తేదీ ప్రకటన..!

స్వతంత్ర వెబ్ డెస్క్: గ్రూప్ 2 పరీక్ష రీ-షెడ్యూల్ తేదీని టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్ 2, 3వ  తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. టీఎస్పీఎస్సీ గ్రూప్-2(GROUP-2) పరీక్షను ప్రభుత్వం ఆగస్టు 12వ తేదీన వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు.

లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టీఎస్‌పీఎస్సీతో సంప్రదించి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని  సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. భవిష్యత్తులో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లు సరిగ్గా ఉండేలా చూడాలని చీఫ్ సెక్రటరీకి ముఖ్యమంత్రి కేసీఆర్  సలహా ఇచ్చారు, అలాగే ప్రతి ఔత్సాహికుడికి అర్హత ఉన్న అన్ని పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన సమయం లభిస్తుంది..అని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రూప్ పరీక్ష వాయిదా పడింది.

 

Latest Articles

ఈటల ఫ్లెక్సీ రచ్చపై స్పందించిన రామచందర్‌రావు.. కొందరు కుట్రలు చేశారు

ఈటెల రాజేందర్ మీద వచ్చిన అభియోగాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామ్ చందర్ రావు స్పందించారు. ఈటెల ఏడుపు బీజేపీకి శాపం అంటూ హైదరాబాద్ లో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. బ్యానర్లు, పోస్టర్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్