Har Ghar Tiranga: సెల్ఫీ అప్ లోడ్ చేస్తే సర్టిఫికెట్ ఇస్తారు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి  ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ (Azadika Amrit Mahotsav) అనే కార్యక్రమాన్ని  నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘హర్ ఘర్ తిరం’గా(Har Ghar Tiranga) పేరుతో ఆగస్టు 13, 14వ తేదీల్లో పౌరులు తమ సోషల్ మీడియా(Social Media) అకౌంట్ల డీపీలు, స్టేటస్‌లలో త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని  ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సూచించారు.  ప్రతి భారతీయుడికి త్రివర్ణ పతాకంతో భావోద్వేగ అనుబంధం ఉంది. ఇది దేశ ప్రగతికి మరింత కష్టపడి పనిచేయడానికి స్ఫూర్తినిస్తుంది.

ఆగస్టు 13 నుండి 15వ తేదీ మధ్య జరిగే హర్‌ఘర్‌తిరంగ ఉద్యమంలో మీరందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అంటూ మోదీ ట్వీట్ చేశారు.  ‘హర్ ఘర్ తిరంగాలో భాగంగా.. harghartiranga.com పోర్టల్‌ను కేంద్రం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌లో దేశ పౌరులు తమ ఫోటోలతో పేరు నమోదు చేసుకోవచ్చని సూచించింది. ఇలా నమోదు చేసుకున్న వారికి సర్టిఫికేట్ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అయితే మోదీ పిలుపుతో వెంటనే దేశ పౌరులు వెబ్ సైట్ కు వెళ్లి తమ ఫోటో, పేరును నమోదు చేసుకుంటున్నారు. క్షణాల్లోనే ఈ సంఖ్య  వన్  మిలియన్  కు చేరుకుంది.

ఎలా చేసుకోవాలంటే
ముందుగా హర్ తిరంగ వెబ్ సైట్  ( https://harghartirang.com ) కు వెళ్లాలి .  అక్కడ మిమల్ని అప్లోడ్  సెల్ఫీ విత్ ఫ్లాగ్ అని అడుగుతుంది.  అందులో మీ పేరుతో పాటుగా  ఫోటోను అప్లోడ్  చేయాలి.  ఆ తరువాత మీక సబ్మిట్ బటన్ వస్తు్ంది. ఇవన్నీ మీరు సక్సెస్ ఫుల్‌గా చేసుకోగలిగితే.. మీకో  సర్టిఫికెట్ కనిపిస్తుంది. దాన్ని మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సేవ్ చేసుకుని తర్వాత ఎప్పుడైనా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అయితే సెల్ఫీతో   పాటు సర్టిఫికెట్ కావాలంటే ఆగస్టు 16 ఉదయం 8 గంటల వరకు ఆగాల్సిందే.

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్