ఇక సినిమా కోసం వేసిన సెట్స్, కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ కాస్ట్యూమ్స్ వావ్ అనిపిస్తున్నాయి. ఇక ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీత సారథ్యంలో పాట వినసొంపుగా ఉంది. శ్రీనిధి తిరుమల పాడిన ఈ పాటను చైతన్య ప్రసాద్ రాశారు. 2005లో పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. హర్రర్ జోనర్‌లో సరికొత్త సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన చంద్రముఖి చిత్రానికి కొనసాగింపుగా ఇప్పుడు ‘చంద్రముఖి-2’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్, ఆంథోని ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
‘చంద్రముఖి 2’ను వినాయక చవితికి ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు.
నటీనటులు:
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: పి.వాసు, బ్యానర్: లైకా ప్రొడక్షన్స్, నిర్మాత: సుభాస్కరన్, సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్, ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి, మ్యూజిక్: ఎం.ఎం.కీరవాణి, ఎడిటర్: ఆంథోని, స్టంట్స్: కమల్ కన్నన్, రవివర్మ, స్టంట్ శివ, ఓం ప్రకాష్, లిరిక్స్: యుగ భారతి, మదన్ కర్కి, వివేక్, చైతన్యప్రసాద్, కాస్ట్యూమ్స్: పెరుమాల్ సెల్వం, కాస్ట్యూమ్ డిజైనర్: నీతా లుల్లా, దొరతి, మేకప్: శబరి గిరి, స్టిల్స్: జయరామన్, ఎఫెక్ట్స్: సేతు, ఆడియోగ్రఫీ: ఉదయ్ కుమార్, నాక్ స్టూడియోస్, పబ్లిసిటీ డిజైన్: ముత్తు, పాయింటర్ స్టూడియో, పి.ఆర్.ఒ: యువరాజ్(తమిళ్), సురేంద్ర నాయుడు – ఫణి కందుకూరి (తెలుగు).


