ఇలా మాట్లాడే వాళ్ళని ఏం చేయాలో స్పీకర్ చెప్పాలి.. కేటీఆర్ డిమాండ్..!

స్వతంత్ర వెబ్ డెస్క్:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (CM KCR) ఉద్దేశించి పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ (Minister KTR) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీని అవమానించారన్న కారణంతో కాంగ్రెస్‌ ఎంపీపై చర్యలు తీసుకున్నారని.. మరి ఇప్పుడు సీఎం కేసీఆర్‌పై అత్యంత నీచమైన భాషలో మాట్లాడిన బీజేపీ ఎంపీని ఏం చేయాలో స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్‌ శుక్రవారం ఉదయం ట్వీట్‌ చేశారు.

‘ప్రధాని ఇంటిపేరును అవమానకరంగా పిలిచినందుకు కాంగ్రెస్‌ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎంపీ నిన్న లోక్‌ సభలో తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ఎన్నికైన పాపులర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అత్యంత నీచమైన భాషలో దూషించారు. ఇప్పుడు లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా ఏం చేస్తారు..?’ అని ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు.

Latest Articles

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్