23.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

Hyderabad: పరీక్షల్లో ఫెయిల్ అయిన కొడుకు.. ఆత్మహత్య చేసుకున్న తల్లి..!

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్ గాజులరామారంలో (Gajula ramaram) విషాదం చోటు చేసుకుంది. కుమారుడు సీఏ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడని మనస్థాపం చెంది తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. దీంతో ఆమె కుుటంబంలో విషాదం అలుముకుంది.  పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకం. ఈ ఏడాది వెలువడిన ఇంటర్, టెన్త్ ఫలితాల సమయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు తీకున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే.. జీవితంలో అన్నీ కోల్పోయినట్లు భావించి ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

ఇలాంటి సమయాల్లో పిల్లలకు తల్లిదండ్రులే ధైర్యం చెప్పాలి. ఈ పరీక్ష కాకపోతే.. మరో పరీక్ష అని.. జీవితంలో ఎదురయ్యే పరీక్షల ముందు ఇవన్నీ చిన్నవని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదించాలి. కానీ ఓ తల్లి అందుకు భిన్నంగా వ్యవహరించింది. కుమారుడు పరీక్షల్లో (Exams) తప్పాడని తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌ గాజుల రామారాంలో చేటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారంలోని బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నాగభూషణం, పుష్పజ్యోతి(41) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. భర్త ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా పుష్పజ్యోతి గృహిణి. ఇటీవల ఓ కుమారుడు ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షలు రాశాడు. అయితే సీఏ ఫలితాల్లో కుమారుడు ఉత్తీర్ణత సాధించలేదు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్