20.2 C
Hyderabad
Monday, December 23, 2024
spot_img

Minister Mallareddy: జవహర్ నగర్ బాధిత మహిళకు పెళ్లి చేయిస్తాం, ఉద్యోగం ఇస్తాం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్‌‌లో (Jawahar nagar) ఓ యువతిని వివస్త్రను చేసిన ఘటన సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో స్పందించింది. నిందితున్ని వెంటనే అరెస్ట్ చేసి.. చర్యలకు ఉపక్రమించింది.

కాగా..ఈ విషయంపై అదే నియోజకవర్గానికి చెందిన మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) స్పందించారు. బాధిత యువతిని పరామర్శించిన మంత్రి మల్లారెడ్డి.. అండగా నిలుస్తానంటూ మాట ఇచ్చారు. బాధిత యువతికి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు మల్లారెడ్డి. అంతేకాదు.. యువతికి పెళ్లి కూడా చేపిస్తానని,  డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వాలని అధికారులను మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. భవిష్యత్‌లో సదరు యువతి యోగక్షేమాలు కూడా తానే చూసుకుంటామని కుటుంబ సభ్యులకు మంత్రి మల్లారెడ్డి అభయం ఇచ్చారు.

Latest Articles

డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్