DHIMAHI: ‘ధీమహి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్

కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11 PM చిత్రం ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా ‘ధీమహి’. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులు. ఇందులో నిఖిత చోప్రా హీరోయిన్. షారోన్ రవి సంగీతం అందించారు. షూటింగ్ మరియు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ తో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.

అనంతరం చిత్ర యూనిట్ మాట్లాడుతూ “ధీమహి చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. 7:11 చిత్రంలో నటించిన సాహస్ పగడాల ఈ చిత్రంలో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించారు. ఇది ఒక థ్రిల్లర్ చిత్రం. షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మా చిత్రంలోని పాటలను త్వరలో జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేస్తాము. ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉన్నాము. త్వరలోనే ట్రైలర్‌తో మీ ముందుకు వస్తాం. మంచి రిలీజ్ డేట్ చూసుకుని చిత్రాన్ని విడుదల చేస్తాము” అని తెలిపారు.

నటీనటులు : సాహస్ పగడాల, నిఖిత చోప్రా, విరాట్ కపూర్, జె డి చెరుకూరు, ఆషిక, శ్రీజిత్, గంగాధరన్, సౌజన్య కాసినా, వంశి దావులూరి, తదితరులు.

సాంకేతిక నిపుణులు:

ఎడిటర్ : సంతోష్ కామిరెడ్డి

కెమెరా మాన్ : రహ్ శర్మ

మ్యూజిక్ : షారోన్ రావి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చైతు పడిగల

కో ప్రొడ్యూసర్ : ఎమ్ ఎస్ కార్తీక్, శ్రీధర్ రెడ్డి గూడా

దర్శకులు : సాహస్ పగడాల, నవీన్ కంటె

నిర్మాతలు : విరాట్ కపూర్ , సాహస్ పగడాల

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్