Tomato : తగ్గేదేలే.. టమాటా ఆల్ టైమ్ రికార్డ్.. కిలో ఎంతో తెలుసా..?

స్వతంత్ర వెబ్ డెస్క్: టమాటా ధర సెంచరీ దాటిన తర్వాత నుంచి జనాలు.. దాన్ని కొనాలంటేనే భయపడుతున్నారు. ఇప్పుడైతే ఏకంగా కిలో టమాటా ధర డబుల్‌ సెంచరీకి పైనే ఉంది. టమాటా ధర సామాన్యుల చేత కన్నీరు పెట్టిస్తోంటి.. ఈ ఏడాది టమాటా పండించిన అన్నదాతలు మాత్రం సంతోషంగా ఉన్నారు. ప్రతి ఏటా అరకొర ధరలతో ఇబ్బంది పడ్డ అన్నదాతలు.. ఈ ఏడాది టమాటా రూపంలో జాక్‌పాట్‌ కొట్టారు. ఈ ఏడాది నెల నుంచి 2 నెలల వ్యవధిలో టమాటా రైతుల దశ తిరిగింది. కోటీశ్వరలు, లక్షాధికారులు అయ్యారు.

భారీ వర్షాల నేపథ్యంలో టమాటా ధర ఇప్పట్లో దిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో టమాటా ధర ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఏపీలో టమాటా ధరకు ఇప్పట్లో బ్రేకులు పడే సూచనలు కనిపించడం లేదు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్‌లో మంగళవారం నాణ్యమైన టమాటా ధర రికార్డు స్థాయికి చేరింది. కిలో ధర ఏకంగా 224 రూపాయలు పలికింది. దాదాపు పది వేల క్రేట్ల పంట రాగా.. వేలంలో క్రేటు ధర రూ.5,600 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ఇక్కడికి వచ్చిన టమాటా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారట.అలానే అనంతపురం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.

కక్కలపల్లి టమాటా మార్కెట్‌ మండీలో కిలో టమాటా 215 రూపాయలు పలికింది. 15 కిలోల టమాటా బుట్ట అనూహ్యంగా 3200 రూపాయలకు అమ్మడయ్యింది. ఈ సీజన్‌లోనే కాక.. ఈ మార్కెట్‌ చరిత్రలోనే ఇదే అత్యధిక రేటు అంటున్నారు వ్యాపారులు. జిల్లాకు చెందని ఓ రైతు ఏకంగా 90 బుట్టల టమాటాల తీసుకువచ్చాడు. నాణ్యత బాగున్న సుమారు 79 బుట్టల టమాటాలను ఒక్కొటి 3200 రూపాయలకు అమ్మినట్లు వెల్లడించాడు.

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్