రామ్ చరణ్ ‘రంగస్థలం’ రేంజ్‌లో విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 11వ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ నిర్మిస్తున్నాయి. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల నేపథ్యంలో జరిగిన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, ఈ మూవీ గ్లింప్స్ ని కూడా విడుదల చేసింది చిత్రబృందం. “మేము గోదారోళ్ళం.. మాట ఒకటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం” అంటూ విశ్వక్ సేన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో గ్లింప్స్ ప్రారంభమైంది. విశ్వక్ సేన్ లుంగీ కట్టుకొని ఊర మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. రాత్రిపూట లారీల్లో అక్రమంగా సరకు తరలించడం, గోదావరి పరిసరాలు, యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన గ్లింప్స్ మెప్పిస్తోంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.

క్రూరమైన ప్రపంచంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదిగిన వ్యక్తిగా విశ్వక్ సేన్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఆయన గ్రే పాత్ర పోషిస్తున్నారని, ఈ సినిమాలో ఆయన నటన ప్రశంసలు అందుకునేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఫస్ట్ గ్లింప్స్ వీడియో చూస్తుంటే రామ్ చరణ్ ‘రంగస్థలం’ రేంజ్‌లో విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఉంటుందని అర్థమవుతోంది. నేహాశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి ‘రత్నమాల’ అనే ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా 2023, డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సినిమాటోగ్రాఫర్: అనిత్ మధాది
ఎడిటర్: నవీన్ నూలి
సహ నిర్మాతలు: వెంకట్ ఉప్పులూరి, గోపీచంద్ ఇన్నమూరి
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం: కృష్ణ చైతన్య
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్