ఊహించిందే నిజమైంది.. బండి సంజయ్ కు కీలక పదవి..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో బీజేపీ నాయకత్వ మార్పులకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా వున్న బండి సంజయ్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ను నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చే నిజమైంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బీజేపీ అధిష్టానం జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారనే చర్చ జరిగింది.

అంతేకాదు ఇటీవల ఢిల్లీ పర్యటన సమయంలో హోంమంత్రి అమిత్ షాతో బండి సంజయ్ భేటీ తరువాత ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. అంతా ఊహించినట్టుగానే బండి సంజయ్ ను బీజేపీ జాతీయ నాయకత్వంలోకి తీసుకుంది.  బండి సంజయ్ ను జాతీయ నాయకత్వంలోకి తీసుకుంటున్నట్టు.. అతనికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.  కాగా ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో బీజేపీ నాయకత్వ మార్పులకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా వున్న బండి సంజయ్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు.  అలాగే హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ప్రచార కమిటీ చైర్మన్ పదవి కేటాయించగా..మునుగోడు మాజీ ఎమ్మెల్యే,  బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది.

ఈ సమయంలో బండి సంజయ్ కు జాతీయ స్థాయిలో పదవి కేటాయించడానికి కొంత సమయం తీసుకున్న అధిష్టానం గతంలోనే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. బండి అవసరాలను జాతీయ స్థాయిలో వాడుకుంటామని నడ్డా ప్రకటించగా తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ను బీజేపీ అధిష్టానం నియమించింది. ఇక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను నియమించగా..బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఏపీ నేత సత్యకుమార్ ను నియమిస్తున్నట్టు పేర్కొంది.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్