Vishaka: నకిలీ నేవీ కమాండర్.. రెడ్‌హ్యాండెట్‌గా పట్టుకున్న పోలీసులు

స్వతంత్ర వెబ్ డెస్క్: విశాఖపట్నంలో నకిలీ నేవీ కమాండర్ హల్‌చల్ చేయడం కలకలం రేపింది. నేవీ యూనిఫాంతో ఆ కార్యాలయ ప్రాంతాల్లో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలపతిరావు అనే వ్యక్తి నేవీ దుస్తుల్లో సంబంధిత కార్యాలయ ప్రాంగణంలో తిరుగుతుండగా నేవీ పోలీసులకు అనుమానం వచ్చి ప్రశ్నించారు. దీంతో చలపతిరావు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో.. నకిలీ నేవీ అధికారి అని గుర్తించి మల్కాపురం పోలీసులకు అప్పగించారు.

నేవీ అధికారిగా చెలమాణి అవుతున్న చలపతిరావుపై విజయవాడలో కూడా గతంలో ఇదే తరహా కేసు నమోదైంది. నకిలీ ఐడీ కార్డుతో నేవీ క్యాంటీన్‌లో సామగ్రి కూడా కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇండియన్ ఆర్మీకి చెందిన అగ్నివీర్ ఉద్యోగాలు ఇప్పిస్తాంటూ నిరుద్యోగులను మోసం చేయడమే లక్ష్యంగా నిందితుడు నకిలీ నేవి అధికారి అవతారం ఎత్తినట్లు పోలీసులు గుర్తించారు.

చలపతిరావుపై రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆరు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. విశాఖపట్నంలోని ఒన్ టౌన్, టూ టౌన్, మల్కాపురం, విజయవాడలోని పెనమలూరు సహా పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై చీటింగ్ కేసులు ఉన్నట్లు చెప్పారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేయడమే చలపతిరావు ప్రవృత్తి అని పోలీసులు తెలిపారు. చలపతిరావు ఇప్పటి వరకు 15 మంది బాధితుల నుంచి రూ. 30 లక్షలు వసూలు చేశాడని పోలీసులు వెల్లడించారు. ఈజీ మనీ, జల్సాలకు అలవాటు పడ్డ చలపతిరావు తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించేందుకు ఇలాంటి దారి ఎంచుకున్నాడని వివరించారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్