26.2 C
Hyderabad
Friday, February 6, 2026
spot_img

Fake Baba: ఖమ్మంలో నకిలీ బాబా హల్చల్.. కోటి 30 లక్షల హాంఫట్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం వాసుల నుంచి ఓ నకిలీ బాబా కోటి 30 లక్షల రూపాయలు కాజేశాడు. ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగాలేదని మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలోని షేక్ నయ్యర్ అనే బాబా దగ్గరికి ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ ఖాసీం కుటుంబం వచ్చింది. ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని అందుకే ఇంట్లో అందరూ అనారోగ్యం పాలవుతున్నారని ఆ బాబా నమ్మించాడు.

ఇల్లు, పొలం అమ్మేస్తే సమస్య తొలగిపోతుందని నయ్యర్ బాబా చెప్పాడు. ఈ నేపథ్యంలో షేక్‌ ఖాసీం కూడా ఇల్లు, పొలం అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఆ నకిలీ బాబానే మధ్యవర్తిగా ఉండి 5 ఎకరాల పొలం, ఇల్లు అమ్మించి కోటి 30 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ డబ్బులకు బదులు హైదరాబాద్‌లో ఇల్లు ఇస్తానని, కొడుకుకి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నయ్యర్ బాబా చెప్పాడు.

కొన్ని రోజులకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో బాధితుడు షేక్‌ ఖాసీం మంగళవారం మక్కరాజుపేటకు వచ్చాడు.దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గతంలో నకిలీ బాబా నయ్యర్‌పై 2017లో హైదరాబాద్‌లో 70 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆసీఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇలా బాబాలను నమ్ముకుని మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్