విజయ్ దేవరకొండ, సమంత ‘ఖుషి’ టైటిల్ సాంగ్ అప్‌డేట్ వచ్చేసింది!

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన నా రోజా నువ్వే, ఆరాధ్య పాటలు సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు ఖుషి నుంచి మూడో పాట రానుంది. ఖుషి అంటూ సాగే ఈ పాటను జూలై 28న రిలీజ్ చేయతోన్నారు.

ఈ టైటిల్ సాంగ్ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేమలో మునిగినట్టు.. అలా గాల్లో తేలిపోతోన్న విజయ్ దేవరకొండ పోస్టర్ ఎంతో కూల్‌గా ఉంది. జూలై 28న ఖుషి టైటిల్ సాంగ్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ్, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.

నటీనటులు:
విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్