11 ఏళ్ల తరువాత ట్విట్టర్‌లో జుకర్ బర్గ్ పోస్ట్

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రముఖ సామాజికమాధ్యమం ఫేస్ బుక్ ఫౌండర్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 11 ఏళ్ల తర్వాత మళ్లీ ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్ కు పోటీగా మెటా డెవలప్ చేసిన థ్రెడ్ కు సంబంధించి పోస్ట్ చేశాడు. స్పైడర్ మేన్ దుస్తులు ధరించిన వ్యకి అదే దుస్తులు ధరించిన మరొక వ్యక్తిని చూపుతున్నట్టు ఉన్న చిత్రాన్ని షేర్ చేశాడు. ఇది 1967లో వచ్చిన స్పైడర్ మేన్ కార్టూన్ ‘డబుల్ ఐడెంటిటీ’ లోనిది. విలన్ హీరోగా కనిపించేందుకు ప్రయత్నించేలా ఆ చిత్రం ఉంది. అయితే కేవలం కార్టూన్ ఫొటోను మాత్రమే మార్క్ షేర్ చేశారు. కాగా ట్విట్టర్ అధినేత మస్క్ ను ఉద్దేశించే ఆయన ఈ పోస్ట్ షేర్ చేసినట్లు తెలుస్తోంది. 2012 జవనరి 18న జుకర్ బర్గ్ చివరి సారిగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన మైక్రోబ్లాగింగ్ సైట్ లో ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి.

కాగా, 2012జనవరి 18న జుకర్ బర్గ్ ఆఖరిసారిగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ తర్వాత ఆయన మైక్రోబ్లాగింగ్ సైట్ లో ట్వీట్ చేయడం ఇదే తొలిసారి. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విట్టర్ కు పోటీగా ఇటీవల మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కొత్త యాప్ ను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెటా కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. థ్రెడ్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఇందులో ఖాతాలు తెరవగా తొలి నాలుగు గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు పెరిగింది. ఈ విషయాన్ని మెటా సీఈవో జుకర్ బర్గ్ పేర్కొన్నారు. మెటా తీసుకొచ్చిన ఈ కొత్త థ్రెడ్స్ యాప్ ను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను వినియోగించి లాగిన్ చేసుకోవచ్చు. ఇందులో సుమారు వర్డ్స్ తో లింక్స్, ఫోటోలు, ఐదు నిమిషాల నిడివి గల వీడియోలు కూడా పోస్ట్ చేసుకోవచ్చు.

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్