ప్రపంచంతో పోటీ పడే సత్తా మనకి ఉంది: కేటీఆర్

స్వతంత్ర వెబ్ డెస్క్: మానవ వనరులు, నైపుణ్యానికి హైదరాబాద్‌ రాజధాని అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలోని నానక్‌రామ్‌గూడలో స్టెల్లాంటిస్‌ డిజిటల్‌ హబ్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. సస్టెయినబుల్‌ మొబిలిటీకి మాత్రమే భవిష్యత్తు ఉందన్నారు. మొబిలిటీ వ్యాలీలో స్టెల్లాంటిస్‌ భాగస్వామ్యం కావడం సంతోషకరమని చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో అభివృద్ధి విప్లవంలా సాగుతోంది. వ్యాపార విస్తరణకు నగరం ఎంతో అనుకూలమైనది. ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ హబ్‌లను ప్రోత్సహిస్తున్నాం. సమర్థ ప్రభుత్వం, పటిష్ఠ నాయకత్వం వల్లే పెట్టుబడులు వస్తున్నాయి’’ అని కేటీఆర్‌ అన్నారు.

రిసోర్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా హైదరాబాద్‌ ఎదిగిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంతో పోటీపడే సత్తా మనకు ఉందని చెప్పారు. ట్యాలెంట్‌ ఉన్న పిల్లలకు మనదేశంలో కొరతలేదని తెలిపారు. హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో సెల్లాంటిస్‌ డిజిటల్‌ హబ్‌ను, రైట్‌ సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆటోమొబైల్‌ రంగం కూడా ఇప్పుడు కంప్యూటర్‌ ఓరియెంటెడ్‌ డిజైన్స్‌ ద్వారా ముందుకు వెళ్తున్నదని చెప్పారు. ప్రభుత్వం మొబిలిటి వ్యాలి ప్రారంభించిందన్నారు. కంపెనీకి ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉండగా హైదరాబాద్‌ ఐటీలో 3 లక్షల మంది పనిచేసే వాళ్లు, ప్రస్తుతం ఆ సంఖ్య 9 లక్షలకుపైగా పెరిగిందన్నారు. ఇక్కడ ఉన్న గ్రోత్‌ దేశంలోని ఏ నగరంలో లేదని వెల్లడించారు. వరంగల్‌లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేసిందందుకు రైట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. మూడేండ్లలో వెయ్యి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినందుకు అభినందించారు. రైట్‌ సాఫ్ట్‌వేర్‌ సీఈవో కృష్ణను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం టీహబ్‌లో మోబిస్‌-బిట్స్‌ పిలాని హైదరాబాద్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్