స్వతంత్ర వెబ్ డెస్క్: రాజకీయాలు, అటు సినిమాలతో బిజీగా గడుపుతున్న కుష్బూ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని కుష్బూ స్వయంగా తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు.. కోకిన్స్ బోన్ చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రికి వచ్చినట్లు ఆమె చెప్పారు.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నా త్వరలోనే కోలుకుంటానని తెలిపారు.. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. కుష్బూ తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా పనిచేసిన ఆమె.. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీలో చేరిన తర్వాత ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు పదవి చేపట్టారు. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ప్రతిపక్షాలకు తనదైన రీతిలో మాటలను వదులుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు కుష్బూ.
ఆసుపత్రిలో ఖుష్బూ.. ఆందోళనలో ఫ్యాన్స్
Latest Articles
- Advertisement -