28.7 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

మెగాస్టార్ సినిమా టీజర్‌ మెగా లాంచ్ ఈవెంట్

స్వతంత్ర వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారు. ఏడాది వ్యవధిలో మూడు సినిమాలు విడుదల చేసిన ఆయన మరో మూవీ సిద్ధం చేశారు. దర్శకుడు మెహర్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న అప్డేట్ మరి కొన్ని గంటల్లో రానుంది. చిరంజీవి మరోసారి ఊర మాస్ రోల్ చేశారు. ఆయన లుక్స్ వింటేజ్ చిరును గుర్తు చేశాయి. ఈ మూవీ టీజర్ లాంచ్ కి రెడీ అయ్యారు. భోళా శంకర్ ప్రమోషన్స్ కి సాలిడ్ స్టార్ట్ ఇచ్చేలా టీజర్ ని లాంచ్ చెయ్యాలనేది మేకర్స్ ప్లాన్. అందుకే భోళా శంకర్ టీజర్ ని రేపు సాయంత్రం 4 గంటలకి సంధ్య 70MM థియేటర్ లో ఈవెంట్ చేసి లాంచ్ చెయ్యనున్నారు.

తమన్నా, కీర్తి సురేష్ లు కూడా నటిస్తున్న ఈ మూవీ అజిత్ నటించిన తమిళ సినిమా ‘వేదాళం’కి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇటీవలే భోళా శంకర్ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘భోళా మేనియా’ సాంగ్ కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. చిరు చాలా యంగ్ గా కనిపిస్తుండడం విశేషం. భోళా శంకర్ సినిమా కూడా హిట్ అయితే ఒకే ఏడాదిలో రెండు హిట్స్ ఇచ్చిన టాప్ హీరోగా చిరు హిస్టరీ క్రియేట్ చేస్తాడు.

Latest Articles

ఎందుకు చిప్స్ ప్యాకెట్లలో గాలి నింపి ఉంటుంది? అసలు నిజం ఇదే!

మనకు ఇష్టమైన చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసి తెరిచినప్పుడు అందులో సగం వరకు మాత్రమే చిప్స్ ఉండి, మిగతా భాగం మొత్తం గాలితో నిండిపోయి ఉండటం చూసి చాలా మందికి నిరాశ కలుగుతుంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్