యాదగిరిగుట్టలో అందుబాటులోకి మిల్లేట్ల ప్రసాదం

స్వతంత్ర వెబ్ డెస్క్: యాదగిరిగుట్టలో చిరుధాన్యాల ప్రసాదాన్ని ప్రారంభించారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అండుకొర్రలు, అరికెలు, సామలు, సామలు, బెల్లంతో చిరుధాన్యాల లడ్డూలను తయారు చేసిన లడ్డులు భక్తులకి అందుబాటులో ఉండనున్నాయని.. ఈ ప్రసాదం ధర రూ. 40./- నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇక స్వామి వారి బంగారు, వెండి నాణేల విక్రయాలని కూడా మొదలు పెట్టారు.. వాటి ధర . 3 గ్రాముల బంగారం డాలరు రూ.21,000/-, 5 గ్రాములు వెండి రూ. 1,000/- ఉండనుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వృద్దులు, వికలాంగుల కోసం రూ.21 లక్షల వ్యయంతో 3 బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చామని ఆన్నారు.

ఇక ముందుగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ ఈఓ, అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి ప్రధాన ఆలయంలో స్వయంబు దేవుడిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు మంత్రిని ఆశీర్వదించగా, ఆలయ ఈవో శ్రీస్వామివారి ప్రసాదాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, YTDA వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, తదితరులు పాల్గోన్నారు.

Latest Articles

‘జెన్ జీ’ఓటర్లను ఆకర్షించలేకపోతున్న కాంగ్రెస్

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు 'జెన్ జీ' ఓటర్ల చుట్టూ తిరుగుతున్నాయి. నవతరం ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యత్వ నమోదుతో దూసుకుపోతుంటే.. అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్