స్వతంత్ర వెబ్ డెస్క్: బ్యాడ్మింటన్లో సాత్విక్-చిరాగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇండోనేషియా ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ను భారత్కు చెందిన సాత్విక్-చిరాగ్ జోడి కైవసం చేసుకుంది. ఆదివారం జకార్తాలో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్లో మలేషియా జోడీ అయినా ఆరోన్ చియా–సో వుయ్ యిక్ జోడిని ఓడించి విజేతగా నిలిచింది. హోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో 21-17, 21-18 తేడాతో విజయం సాధించింది. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో విజేతగా నిలిచిన మొదటి భారత జోడిగా రికార్డు నెలకొల్పింది. సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టీ జోడి ప్రదర్శన ఈ ఏడాది నిలకడగా ఉంది. ఈ సీజన్లో స్విస్ ఓపెన్, ఆసియా ఛాంపియన్ షిప్లో విజేతలుగా నిలిచి స్వర్ణ పతకాలను అందుకోగా మలేసియా ఓపెన్లో సెమీస్లో ఓడింది. అయితే.. తాజాగా ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటి విజేతగా నిలిచింది.
చరిత్ర సృష్టించిన సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టీ జోడి
0
522
Previous article
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


