స్వతంత్ర, వెబ్ డెస్క్: విజయవాడలో వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా కారు బీభత్సం సృష్టించింది. బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం అర్ధరాత్రి వేగంగా బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బైకును బలంగా ఢీకొట్టడంతో కారు ముందుభాగం ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే కారుపై ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్‌ను అనుచరులు తొలగించారు. ఆ తర్వాత కారును అక్కడే వదిలేసి డ్రైవర్‌తో కలిసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకుని గుణదల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విజయవాడలో ఎమ్మెల్సీ కారు బీభత్సం.. ఒకరు మృతి
0
350
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


