స్వతంత్ర, వెబ్ డెస్క్: భారత బాక్సింగ్ ఫెడరేషన్(WFI) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిష్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రెజ్లర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్రిజ్ భూషణ్‌ను వెంటనే అరెస్ట్ చేయకపోతే ఆసియా గేమ్స్‌లో పాల్గొనబోమని తేల్చిచెప్పారు. ఇటీవల కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చర్చలు జరిపిన రెజ్లర్లు కేంద్రం ముందు ఐదు డిమాండ్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఈనెల 15వ తేదీలోపు ఓ నిర్ణయం తీసుకుంటామని అనురాగ్ చెప్పగా.. అప్పటివరకు ఆందోళనలకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇదిలా ఉండగానే ఏషియన్ గేమ్స్ బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించి ఆందోళన మరింత తీవ్రం చేశారు. కాగా తమను లైంగిక వేధింపులకు గురి చేశారనే ఆరోపణలతో గత కొన్ని రోజులుగా బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే.