స్వతంత్ర, వెబ్ డెస్క్: ఈ నెలలో టెక్స్ట్ టైల్ పార్క్ కి రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను గురువారం చేనేత జౌళి శాఖ సెక్రటరీ డాక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పరిశీలించారు. టెక్స్ట్ టైల్ పార్క్ లో యంగ్ వన్ కంపెనీ ఈ నెల లో పరిశ్రమ ను ఏర్పాటు చేస్తున్నందున దానికి సంబందించిన ఏర్పాట్లను సెక్రటరీ, కలెక్టర్ పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఇది వరకే పరిశ్రమ స్థాపించి ఉత్పత్తి ప్రారంభించిన గణేష్ కంపెనీని సందర్శించారు. అలాగే నిర్మాణ పనులు జరుగుతున్న కి్టేక్స్ గార్మెంట్స్ ప్రతినిధుల తో కలెక్టర్, సెక్రటరీ ఉత్పత్తి, ఉపాధి వివరాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఇండస్ట్రీ నర్సింహా మూర్తి, హ్యాండ్లూమ్స్ ఏడి తదితరులు పాల్గొన్నారు.
టెక్స్ట్ టైల్ పార్క్ కు కేటీఆర్.. ఏర్పాట్లు ముమ్మరం
0
323
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


